On 29th July 2025, fiery Mars enters the practical and analytical sign of Virgo. This cosmic shift influences all 12 zodiac signs in unique ways, especially in areas related to work, health, and discipline. The post also explores the divine connection of Mars with the sacred Mangalnath Temple in Ujjain — a powerful site for Mars remedies and spiritual elevation.
జూలై 29, 2025న కుజగ్రహం (మంగళ గ్రహం) కన్యా రాశిలోకి ప్రవేశించబోతుంది. ఈ రాశి మార్పు 12 రాశులపై వృత్తి, ఆరోగ్యం, క్రమశిక్షణ వంటి అంశాలలో ప్రభావం చూపుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉజ్జయినిలోని పవిత్ర మంగళనాథ్ దేవాలయ విశిష్టతను, మంగళ గ్రహ దోష నివారణలో ఆ దేవాలయ ప్రాధాన్యతను ఈ వ్యాసంలో తెలుసుకోండి.
మేషరాశి…. (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)
మేష లగ్నానికి, ఎనిమిదవ ఇంటికి కూడా అధిపతి కుజుడు మీ జాతకంలో ఆరవ ఇంట్లో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కుజ సంచార సమయంలో, ఆరోగ్యం కూడా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. మీరు పోటీదారుల కంటే ఆత్మవిశ్వాసంతో ముందు ఉంటారు. గౌరవాన్ని పెరుగుతుంది. శని దృష్టిని బట్టి వివాదంలోకి దిగకూడదు మరియు పోటీలో అవతలవారిని తక్కువగా భావించే పొరపాటు కూడదు. కొంత ఆలోచించి, విజ్ఞానంతో చేసే విషయంలో మంచి ఫలితాలు లభిస్తాయి.
వృషభరాశి…(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
లగ్నానికి, 12వ ఇంటికి, 7వ ఇంటికి కూడా అధిపతి కుజుడు మీ జాతకంలో 5వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కుజ సంచార సమయంలో, శని దృష్టి ని కూడ గమనిస్తే తగిన జాగర్తలు అవసరం. ముఖ్యముగా విద్యార్థులు విద్యాసంబంధ విషయాల్లో, డిస్ట్రాకషన్స్ (శ్రద్ధ తగ్గటం, ఆలోచనలు వేరేవిధముగా వెళ్ళిపోటాము) జాగర్త అవసరము. శ్రీ హయగ్రీవాయనమః పఠించాలి. ప్రియమైన వ్యక్తులతో వాగ్వాదములకి దూరము మంచిది. వ్యాపారములలో, విదేశీ ప్రయాణములు, ఉద్వేగాలు లో జాగర్త.
మిధున రాశి…(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
లగ్నానికి, 11వ ఇంటికి, 6వ ఇంటికి కూడా అధిపతి కుజుడు మీ జాతకంలో 4వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కుజ సంచార సమయంలో, శని దృష్టి ని కూడ గమనిస్తే విద్య, గృహ, వాహన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. గృహసౌక్యం, డ్రైవింగ్, స్థిరస్తులపై శ్రద్ధ అవసరము. ముఖ్యముగా కెరీర్, ఆర్ధిక, విషయము అధిక శ్రమ. కొత్త కొనుగోలు అమ్మకాల్లో ఆత్మీయుల సలహా అవసరము.తొందర పనికి రాదు. ఆహారస్వీకారణలో సమయపాలన అవసరము.
కర్కాటక రాశి…(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)
లగ్నానికి, 10వ ఇంటికి, 5వ ఇంటికి కూడా అధిపతి కుజుడు మీ జాతకంలో 3వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కుజ సంచార సమయంలో, అనుకూల ఫలితాలు ముఖ్యముగా ఆరోగ్యము శక్తి బాగుంటాయి. వృత్తి, సంతాన అభివృద్ధిలో ఆశించిన ఫలితాలు. వృత్తిలో నూతన మార్పులు.కొత్త నిర్ణయాలు స్థిరత్వం. శని దృష్టి ని కూడ గమనిస్తే కమ్యూనికేషన్ బాగున్నా, తోబుట్టువులతో అభిప్రాయాబేధాలకి దూరము ఉండాలి.
సింహరాశి…(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
లగ్నానికి, 9వ ఇంటికి, 4వ ఇంటికి కూడా అధిపతి కుజుడు మీ జాతకంలో 2వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కుజ సంచార సమయంలో, శని దృష్టిని కూడ గమనిస్తే, కుటుంబ సభ్యులతో మాటల విషయములు, ఆర్ధిక అంశములు అపార్ధములకి ఇబ్బంది అదిగమించాలి. ఉన్నత విద్య, ఆరోగ్య విషయాల్లో జాగర్త అవసరము. అధిక ఖర్చులని నియంత్రించుకోవాలి. తల్లి తండ్రులకి సౌకర్యముల విషయము, పై శ్రద్ధ.
కన్యా రాశి…(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)
లగ్నానికి, 3వ ఇంటికి, 8వ ఇంటికి కూడా అధిపతి కుజుడు మీ జాతకంలో 1వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కుజ సంచార సమయంలో, శని దృష్టి ని కూడ గమనిస్తే, ఆరోగ్యము పై శ్రద్ధ అవసరము. ఉద్వేగాములు అధిగమించవలెను. డ్రైవింగ్, ఋణముల విషయములు, సాంఘిక సంబంధములు లో ఆచి తూచి వ్యవహారించాలి. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టినా మీ ఉద్వేగములని, కోపాన్ని నియంత్రించాలి.
తులా రాశి…(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
లగ్నానికి, 2వ ఇంటికి, 7వ ఇంటికి కూడా అధిపతి కుజుడు మీ జాతకంలో 12వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కుజ సంచార సమయంలో, శని దృష్టిని కూడ గమనిస్తే, ఆర్ధిక ఆరోగ్య శ్రమ విషయాల్లో జాగర్త అవసరము. కుటుంబ వ్యాపార వ్యవహారములు భాగస్వామి ఆరోగ్యము, శ్రమ. పాత ఋణములు వెనక్కి రావటము కష్టము ఈ సమయములో. కొత్త ఋణములు ఇచ్చేముందు ఆలోచించలి.
వృశ్చిక రాశి…(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
లగ్నానికి, 1వ ఇంటికి, 6వ ఇంటికి కూడా అధిపతి కుజుడు మీ జాతకంలో 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కుజ సంచార సమయంలో, శని దృష్టి ని కూడ గమనిస్తే, ఆగిన పనులు ఆర్ధిక అంశాలు ముందుకు వెడతాయి. భూ సంబంధ వ్యవహారములు అనుకూలము, శక్తి ఉత్సాహం పెరుగుతాయి, పోటీదారులపై విజయము. ఋణములు వసులు. అయిన ఆలోచనల విషయము లో జాగర్త. తొందరపాటు నిర్ణయములు తగదు.
ధను రాశి…(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
లగ్నానికి, 5ఇంటికి, 12వ ఇంటికి కూడా అధిపతి కుజుడు మీ జాతకంలో 10వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కుజ సంచార సమయంలో,శని దృష్టి ని కూడ గమనిస్తే, వృత్తిలో శ్రమ శక్తి తో మిశ్రమ ఫలాలు. సంతానముఆరోగ్యము అభివృద్ధి, స్థిరాస్తులు వ్యవహారములు, ఇన్వెస్ట్మెంట్స్ మీదలైన వాటిపై దృష్టి. ఈ అన్ని విషయాల్లో తగిన జాగర్తలు అవసరము.గృహ వాహన కొనుగోలు డ్రైవింగ్ లో శ్రద్ధ అవసరము.
మకర రాశి…(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)
లగ్నానికి, 4వ ఇంటికి, 11వ ఇంటికి కూడా అధిపతి కుజుడు మీ జాతకంలో 9 వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కుజ సంచార సమయంలో, శని దృష్టి ని కూడ గమనిస్తే, సంతానము తో ఆలోచనలు సమన్వయము అవసరము. తండ్రి ఆరోగ్యము, ఉన్నత విద్య పై మిశ్రమ ఫలాలు. అసంతృప్తి ఆదిగమించాలి. తోబుట్టువుల, కుటుంబ సభ్యుల సహకారాన్ని సద్వినియోగ పరచుకోవాలి. అపార్ధములు ఆదిగమించాలి. ప్రయాణములో జాగర్త అవసరము.
కుంభ రాశి…(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
లగ్నానికి, 3వ ఇంటికి, 10వ ఇంటికి కూడా అధిపతి కుజుడు మీ జాతకంలో 8వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కుజ సంచార సమయంలో, శని దృష్టి ని కూడ గమనిస్తే, ముఖ్యముగా తోబుట్టువులు, వృత్తి, వృత్తిలో అధికారులు, కొలీగ్స్ తో అచి తూచి వ్యవహారించాలి. మాటల్లో, ఆర్ధిక అంశాలలో, వాగ్దానల్లో జాగర్త నిదానము అవసరము. ఆరోగ్యముపై ఆకస్మిక ఖర్చులపై దృష్టి అవసరము.
మీన రాశి…(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
లగ్నానికి, 2వ ఇంటికి, 9వ ఇంటికి కూడా అధిపతి కుజుడు మీ జాతకంలో 7వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కుజ సంచార సమయంలో, శని దృష్టిని కూడ గమనిస్తే, ఆర్ధిక కుటుంబ వ్యవహారాల్లో శ్రద్ధ అవసరము. వ్యాపార వ్యవహరల్లో వ్యక్తులతో ఆర్ధిక సంబంధ వ్యతిరేకతలకి అవకాశములు. జీవిత భాగస్వామి ఆరోగ్యము పై శ్రద్ధ, వారి తోమాట పట్టింపులకి అవకాశము ఇవ్వరాదు. ముఖ్య విషయాల్లో ఆటంకములు, వాయిదాలు ఇబ్బందిని కలిగిస్తాయి.
పరిహారములు: కుజ గ్రహ సంచార సమయములో ముఖ్యముగా సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన, దేవాలయ సందర్శన, అష్టోతర శతనామావళి మొదలైనవి ఇబ్బందులు అధిగమించటానికి శక్తి కొరకు మంచిఫలితాలు ఇస్తాయి.
మంగళనాధ్ ఆలయం కుజ గ్రహానికి భారత దేశంలో ఏకైక పెద్ద దేవాలయము
భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన ఏడు తీర్థయాత్ర కేంద్రాలు మరియు ప్రసిద్ధ మహాకాళేశ్వర దేవాలయం మహాకాల్ అని కూడా పిలుస్తారు ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతేకాకుండా, ఇది ట్రాపిక్ ఆఫ్ కర్కాటక రేఖపై ఉంది మరియు భారతదేశంలోని ఇతర పవిత్ర నగరాలతో పోలిస్తే ఇది ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే సమయం గణించడానికి దాని ప్రత్యేక భౌగోళిక స్థానం.
కార్క్ లైన్ లేదా కర్కాటక రేఖ మంగళనాథ్ ఆలయం గుండా వెళుతుంది. శ్రీ మంగళనాథ్ ఆలయం ఉజ్జయిని భూమికి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. భూమిని రెండు సమాన భాగాలుగా విభజించే ప్రైమ్ మెరిడియన్ శ్రీ మంగళనాథ్ ఆలయం ఉజ్జయిని గుండా వెళుతుంది. అందుకే ఈ ప్రదేశం నుండి అంగారకుడిని స్పష్టంగా చూడవచ్చు. అందువల్ల, ఇది ఖగోళ శాస్త్రానికి మరియు జ్యోతిషశాస్త్రానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా మారింది. భారతీయ ఖగోళ శాస్త్రాలు ఉజ్జయిని కేంద్ర సూచనగా పరిగణిస్తాయి. ఇది పురాతన కాలం నుండి జ్యోతిషశాస్త్రానికి ప్రధాన కేంద్రంగా ఉంది.
మంగళనాథ్ ఆలయం భారతదేశం మొత్తం మీద అంగారక గ్రహానికి ఏకైక పెద్ద ఆలయం. మత్స్య పురాణం ప్రకారం, మంగళనాథ్ ఆలయం ఉజ్జయిని మధ్యప్రదేశ్ మంగళ్ లేదా మార్స్ పుట్టిన ప్రదేశం. శక్తివంతమైన దుష్ట శక్తితో భీకర యుద్ధం చేస్తున్నప్పుడు భూమిపై పడిన శివుని చెమట వల్ల ఈ ప్రదేశంలో అంగారక గ్రహం జన్మించిందని పురాణం చెబుతోంది. అతని కుమారుడు ఉగ్రత మరియు ఆవేశం యొక్క క్షణంలో జన్మించాడు కాబట్టి, అతను ఎరుపు రంగుతో జన్మించాడు. అందుకే, ఈ ఆలయానికి మంగళనాథ్ అనే పేరు వచ్చింది.ఉజ్జయిని శ్రీ మంగళనాథ్ ఆలయ పురాణం అంగారక గ్రహం శివుడు మరియు భూమి గ్రహం యొక్క సంతానం అని నమ్ముతారు. ఈ సమయంలో భూమి నుండి అంగారక గ్రహం బయటకు వచ్చిందని, అందుకే ఈ ప్రదేశాన్ని అంగారకుడి మాతృభూమి అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. భూమి అంగారకుడి తల్లి అయినందున ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజూ భూమి పూజ నిర్వహిస్తారు. అంగారక గ్రహం యొక్క చెడు ప్రభావాలను నివారించడానికి మంగళనాథ్ వద్ద వివిధ పూజలు జరుగుతాయి. మార్స్ శక్తి గ్రహం. మంగళనాథ్ ఆలయంలో దేవతలు. భక్తులు అంగారకుడిని శివుని రూపంలో పూజిస్తారు.
డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant