Shani Jayanti (May 26, 2025) నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం । (శనీశ్వరజయంతి – 26.05.2025)

Shani Jayanti, observed on May 26, 2025, marks the divine birth of Lord Shani, the powerful planet Saturn in Vedic astrology. He is described in scriptures with the mantra:
“Neelanjanam Samabhasam Raviputram Yamagrajam” – meaning “the one who glows like blue-black collyrium, son of the Sun, and elder brother of Yama.”
Shani is a karmic planet, known to bring justice, discipline, and spiritual lessons. This Jayanti is a powerful time to perform remedies (Shani Dosha Nivarana Upayas), seek blessings, and practice humility and patience. In this post, discover the astrological and spiritual significance of Shani Jayanti, its impact, and effective rituals to appease Lord Shani.

శనైశ్చర జయంతి, అంటే శనేశ్వరుని జన్మదినం, ఈ సంవత్సరం 2025 మే 26న జరుపుకోబడుతుంది. వేద జ్యోతిష్యంలో శనిని “నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం” అని వర్ణించబడింది. శని దేవుడు సూర్యుని కుమారుడిగా, ధర్మనిరతుడిగా, కర్మ ఫలాలను అందించే న్యాయాధిపతిగా పరిగణించబడతాడు. ఈ రోజున శని గ్రహ శాంతి కోసం ప్రత్యేక పూజలు, జపాలు, దానాలు చేయడం ద్వారా శని దోషాన్ని తగ్గించుకోవచ్చు. ఈ వ్యాసంలో శని జయంతి యొక్క ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రాధాన్యత మరియు శని ఉపాయాల గురించి తెలుసుకుందాం.

(శనిగ్రహ ధ్యాన శ్లోకం)

నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం । 

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం ॥

తా:: నల్లనికాటుకవంటి దేహముగల వాడు, సూర్యుని పుత్రుడు, యమధర్మరాజుకు అగ్రజుడు అయిన శనీశ్వరునికి నమస్కారం.


శని జయంతిని శని పుట్టినరోజుగా గుర్తించారు. శని జయంతిని శని అమావాస్య అని కూడా అంటారు.సూర్యుని కుమారుడు మరియు గ్రహం అయిన శని యొక్క పుట్టినరోజుని ఉత్తర భారతదేశం లొ (పూర్ణిమంత్ క్యాలెండర్ ప్రకారం) జ్యేష్ఠ మాసంలో శని జయంతిని  అమావాస్య    తిథిలో పాటిస్తారు.  దక్షిణ భారత దేశం లొ (అమావాసియత్ క్యాలెండర్ ప్రకారం) శని జయంతి వైశాఖ మాసంలో అమావాస్య తిథి పడుతోంది.  ఇది చంద్ర మాసం పేరు,మరియు ఇది రెండు రకాల క్యాలెండర్లలో శని జయంతి ఒకే రోజు వస్తుంది.  శని జయంతిరోజున భక్తులు భగవాన్ శని యొక్క ఆశీర్వదముకు  ఉపవాసము చేస్తారు మరియు శని దేవాలయాలను సందర్శిస్తారు. లార్డ్ శని న్యాయమైన దేవత *న్యాయాన్ని నమ్ముతారని*నమ్ముతారు మరియు శని సంతృప్తి చెందితే తన భక్తుడిని  అదృష్టంతో ఆశీర్వదిస్తాడు.  శని  ఆశీర్వాదం లేని ప్రజలు, జీవితంలో వారు చేసిన కృషికి ప్రతిఫలం లభించకుండా సంవత్సరాలు శ్రమకు లోనవుతారని విశ్వాసం.

శని భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి హవన్, హోమం, యజ్ఞాలను చేయడానికి శని జయంతి చాలా సరైనరోజు.  శని తైలాభిషేకం మరియు శని శాంతి, పూజలు శని జయంతి సందర్భంగా జరిగే ముఖ్యమైన వేడుకలు.  జాతకంలో సాడే సాతిగా.. (ఏలినటి శని) ప్రసిద్ది చెందిన శని దోష ప్రభావాన్ని తగ్గించడానికి పై వేడుకలు వివిధ శనీశ్వర ఆలయాల్లో నిర్వహిస్తారు.

సాధారణంగా నవగ్రహాల లో ఎవరన్నా భయపడేది శనికి. మాములు మనుష్యులు సైతం అవతవారిపైన కోపం వస్తే ‘శని’ అని తిట్టటం చూస్తాము. శని అంటేనే గజగజలాడతారు. అసలు ఈ శనిదేవుని కథ ఏమిటి? ఆయనకుగల దేవాయాలు ఎక్కడ ఉన్నాయి? ఆయన జాతకరీత్యా ఇచ్చే ఫలితాలు ఎలావుంటాయి? అని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన అంశాలు గోచరిస్తాయి.


నవగ్రహాలకు రారాజు, ప్రత్యక్షదైవం సూర్యుడు. ఆయన సతీమణి సంజ్ఞాదేవి. వారికిరువురు సంతానం. ‘‘యముడు, యమున’’. వారే యమధర్మరాజు, యమునా నది. సూర్యుని వేడికి తాళలేని సంజ్ఞాదేవి తన నీడనుంచి తనలాంటి స్త్రీని పుట్టించి ఆమెకు ‘ఛాయ’ అని పేరుపెట్టి తనబదులు గా తన భర్తదగ్గర ఉండమని కొంతకాలం పుట్టింటికి వెళ్ళి అక్కడ తన తండ్రి అయిన విశ్వకర్మకు తనుచేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట సూర్యుని గురించి తపస్సు చేయసాగెను. అయితే ఆమె నీడనుంచి వచ్చిన ఛాయకి శని, తపతి అను పిల్లలు పుట్టటం వలన ఆమె యమధర్మరాజుని, యమునను చిన్నచూపు చూడటం మొదలు పెట్టింది. తన ప్రేమానురాగాన్నీ తన పిల్లల పై చూపించసాగెను. ఆటలాడుకొను సమయంలో యముడుశని మధ్య అభిప్రాయభేదాలొచ్చి యముడు శని కాలు విరిచాడు. దానికి ఛాయాదేవి కోపించి యముని శపించింది. యమునని నది కమ్మని శపించగా, యముడు కూడా తపతిని తిరిగి నది కమ్మని శపించాడు. అంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్ని అంతా దివ్యదృష్టితో గ్రహించి వారికి కలిగిన శాపముకు చింతించి ‘‘యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రత పొందగల దని, లోకానికి ఉపకారిగా ఉండమని, ఎవరైనా నీ నదిని స్పృశించినా, స్నానంచేసినా వారికి సర్వపాపాలు హరిస్తాయ’’ని చెప్పాడు. అలాగే యమునిని కూడా శాంతి వాక్యాతో ఓదార్చాడు. యముడిని యమలోకానికి పట్టాభిషేకము చేయించాడు. ఆకాశంలో ఛాయను కాలితో తన్నబోయిన యమధర్మరాజుని ఆమె ఆగ్రహంతో ‘‘నీ కాలు మంటలో కాలుతుంది’’ అని శపించగా, ఆ కాలు మంటల్లో పడకుండా మంటపై యుండును అని, రెండోకాలు ఎల్ల వేళలా నీటిలో యుండునని… ధర్మము తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు భగ్గున మండిపోతుందని, నా వరంవల్ల నీ కాలు నీటిలో ఉంటే, రెండోకాలికి ఎలాంటి ప్రమాదం ఉందడని తండ్రి చెప్పెను. అందుకే యమునికి ‘‘సమవర్తి’’ అనే పేరుంది. (ధర్మాధర్మాను, నీళ్ళు, నిప్పును ఒకేలా చూస్తాడు కనుక). శనిని నవగ్రహాలో ఒకనిగా చేసి జ్యేష్ఠాదేవికి ఇచ్చి వివాహం జరిపించెను.
అయితే త్రిమూర్తులు శనికి కొన్ని ఆధిపత్యాలు ఇచ్చారు. ఆయువుకి అధిపతిగా, జనుల పై అతని ప్రభావం వుండేటట్లుగా. శివుడు అయితే శని, యముని ఒకటిగా చేసెను. అంటే యముడే శనిశనియే యముడులాగా.


శని అంటే నవగ్రహాలో ఒక అతి ముఖ్య గ్రహం కాగా, శనికి సంబంధించే సాఢే సాథ్‌ (ఏలినాటి శని, అర్థాష్టమ  శని, అష్టమ శని ముఖ్యంగా చెప్తారు గోచార రీత్యా). జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ప్రతివారి జాతకంలో ఈ ఏలినాటి శని, అర్థాష్టమ, అష్టమ శనులు వస్తూ ఉంటాయి. వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. వారి కర్మానుసారం (వారివారి జన్మ రాశి నుబట్టి) ప్రతివ్యక్తి ఎంతోకొంత శనివలన బాధలు పొందుతారు. అయితే పరిహారాలు సక్రమంగా చేసుకొని, క్రమశిక్షణాయుతమైన జీవనం గడిపి, ‘శని’గాడు అని ఎవర్నీ దూషించకుండా ఉంటే చాలావరకు ఇబ్బందులు అధిగమించవచ్చు. మనిషికి అనుకోని చిక్కులు, ఊహించని ఇబ్బందులు, ఆలస్యాలు, ఆటంకాలు టెన్షన్స్‌ అన్నీకూడా శనివల్ల జరుగుతాయి. మనసులో డిప్రెషన్, అనారోగ్యాలు, చేద్దామనుకున్న పనులన్నీ వాయిదాలు, మానసికఅశాంతి అన్నీ శనిదేవుని ఘనతే అని చెప్పాలి. ప్రతిచోట ప్రతివారితో ఏదోరూపంలో మోసపోవటం, నష్టపోవటం, మానసిక ఘర్షణ అన్నిటికీ సూత్రధారి. అంతేకాకుండా ఈ ఏలినాటి శనిలో ముఖ్యంగా జన్మశని, వ్యయశని, ద్వితీయశనిలో దాదాపుగా రెండున్నర సం॥రాు చొప్పున ఏడున్నర సం॥రాల శని ఉండటంవన ఖర్చు, చిక్కు, అవమానాలు, బంధుమిత్రుల తో విద్వేషాలు ‘నా’ అన్నవారితో వైరాలు, మంచికెళితే చెడు ఎదురవ్వడం, అప్పు, హాస్పిటల్‌ దర్శనాలు ఇలా అనేకరకాలైన ఇబ్బందు లు కలుగుతాయి.

అంతేకాకుండా అర్థాష్టమ, అష్టమ శనులు నడిచేటప్పుడు కార్యాల యందు అసంతృప్తి, గృహ వాహన స్థిర ఆస్తులలో, తల్లికి సంబంధ ఆరోగ్య ఆర్ధికఅంశాలలో చికాకులు, విద్యార్ధులకి విద్య విషయాలులో కాన్సంట్రేషన్ తగ్గటం, వ్యక్తిగత శ్రద్ధ లో, ఆరోగ్యములో లోపము, బద్దకం పెరగటం, పనులలో ఆలస్యములు, వేగము తగ్గటం, ఆకస్మిక ఖర్చులు, ముఖ్యలతో శత్రుత్వములు, ఇచ్చిన ఋణములు వసూలులో ఆటంకములు, న్యాయపరమైన అంశముల్లో చిక్కులువృత్తిలో చికాకులు, అసంతృప్తి, ఆలస్యాలు,అధికారులతో అభిప్రాయా భేదములు, వృత్తిలో ఎదుగుదలలో ఇబ్బందులుఆరోగ్యపరముగా, మాటలతోఆర్ధిక అంశములలో, వాగ్దానాలు నిలుపుకోవటంలొ, రావాల్సిన బకాయిలలో ఆటంకాలు. సంతానముతో ఆలోచనలలో వ్యతిరేకతలు, తెలియని డిప్రెషన్,ప్రశాంతత త తక్కువ, మోకాలు, స్పాండిలైటిస్‌, నరాలుమొదలైన ఇబ్బందులు, దంతరోగాలు , ఇష్టంలేని ప్రదేశాల కి వృత్తిపరమైన మార్పు, వైరాగ్యం, అనుకోని పరిచయాల వల్ల ఊహించని పరిణామాలు, మనసు అంతా వెలితి, ఏదో పోగొట్టుకున్న భావన. అంతా ఉన్నా, అందరి మధ్య ఉన్నా, మంచి హోదా ఉన్నా తెలియని ఆందోళన, అసంతృప్తి, వేదన. ఇవేకాక ఇలా ఎన్నిటికో శనిదేవుడు కారణభూతుడు.

మరి ఆ శనీశ్వరుడుని సంతృప్తిపరచడానికి పరిష్కారాలు (రెమిడీ) అవసరం. శని ఉన్న స్థానం బాగుండనపుడు కనీసం ‘గురు’ బలం అయినా అత్యవసరం. రెండూ బాగోకపోతే ఇబ్బందులు కొంత. అయితే గోచారరీత్యా రెండు గ్రహాల కీ పరిహారం అవసరం. శనివల్ల ఇబ్బందులు ఎదురైతే ‘‘నీలం’’ ధరిస్తే ఇబ్బందుల ను అధిగమించవచ్చు అనుకోవటం సరికాదు. ‘నీలం’ శనిదేవుని రత్నమే అయినా, అది శనిదశలోశని నక్షత్రాలో పుట్టినశనిరాశులలోపుట్టినా, శని (గోచారరీత్యా) అష్టమ, అర్థాష్టమ, ఏలినాటి శనిదశ నడుస్తున్నా పెట్టుకోవటం సరికాదు. పూర్తి జాతకం  చూపించుకున్నాక, ఆ జాతకానికి అవసరమైతే ధరించాలి. 

  • నల్ల ఆవుకు బెల్లంతో కలిపిన నువ్వుండలు తినిపించాలి.
  • శనివారంశని త్రయోదశి, మాసశివరాత్రి మొదలైన రోజులో (నవగ్రహాలో ఉన్న) శనిదేవుని తైలాభిషేకం అత్యంత మేలు . శివునికి రుద్రాభిషేకము కూడా చేయాలి.
  • ప్రతి శనివారం దేవాలయ సందర్శన చాలా మేలు (నవగ్రహ దేవాల యాలు).
  • నూనె, నువ్వులు , మినుములు , ఇనుము మొదలైనవి దానం ఇవ్వవచ్చు.
  • ప్రతి శనిత్రయోదశికి క్రమం తప్పకుండా శని స్తోత్రంశని చాలీసాశని అష్టోత్తర, సహస్రనామ స్తోత్రం పారాయణం చాలా మేలు. ఆ సమయంలో ప్రత్యక్షదైవం సూర్యనారాయణునికి నమస్కారము చాలా మేలు. హనుమన్ చాలీసా, హనుమాన్ మందిరం దర్శనాలు, శివ పూజ, శివ మందిరాలు దర్శనము, కూడ ముఖ్యము.

శని కారకత్వాలు గా ఆయుష్షు, సేవకావృత్తి, వాత వ్యాధులుచెడు సహవాసము, సేవ చేయటం, నపుంసకత్వం, కూలి, అరణ్య సంచారం, నీలం, మినుము, అబద్ధం, దున్నపోతు, పాపం, ఎండిపోవడం, దంతబాధలు, మోకాళ్ళు, కఫవాతం, ఎముక దుఃఖం, వ్యసనం. ఇంకా చాలా చాలా ఉన్నాయి.

శనీశ్వరునికి గలపేర్లు: శనేశ్వరుడు, శనైశ్చరుడు, కాుడు, మంద,కోణ, సూర్యపుత్ర, యమ, సౌరి, ఛాయసుత,… మొదలైనవి

ఏలినాటి శని దోష నివారణకు శని స్తోత్రం

నమస్తేకోణసంస్థాయపింగల్యాయనమోస్తుతే

నమస్తే భభ్రురూపాయకృష్ణాయచ నమోస్తుతే

నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ

నమస్తేయమసంజ్ఞాయ నమస్తేశౌరయేవిభో

నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చరనమోస్తుతే

ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్య చ


ఇది ఏలినాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శని, జాతకరీత్యా శని దశలు , అంతర్దశలు నడిచేవారు ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. గ్రహబాధ తొగి మనశ్శాంతి తప్పక భిస్తుంది.

భారతదేశంలో ముఖ్యమైన  శనీశ్వరుని  దేవాయాలు కొన్ని:

ఆంధ్రప్రదేశ్‌ మందపల్లి – అమలాపురం దగ్గర: ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ ‘మందపల్లి’లో లింగాకారంలో ఉన్న శనేశ్వరుని ‘మందేశ్వరుని’ గా పూజిస్తారు. ఈ లింగాన్ని ప్రతిష్ఠించినందుకు ‘మందలింగేశ్వర స్వామి’ అంటారు.ఇక్కడ శనిత్రయోదశికి అత్యంత కోలాహాంగా శనికి తైలాభిషేకాు చేస్తుంటారు. అక్కడికి వెళ్ళలేనివారు పోస్టు ద్వారా రుసుము చెల్లించి తైలాభిషేకము చేయించుకునే అవకాశం ఉంది.చాలా మహిమగల దేవుడుఈమందలింగేశ్వర స్వామి.
యెర్దనూరు శని దేవాలయం, తెలంగాణ: ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఉంది.  ఈ ఆలయంలో 20 అడుగుల ఎత్తైన శని దేవుడి విగ్రహం ఉంది.

పాండిచ్చేరి తిరువల్లార్‌ శనీశ్వర దేవాయము: ఇదిస్వయంభూ శని దేవాయంగా ప్రసిద్ధి. విదర్భరాజు తన కుమార్తె దమయంతికి  ‘స్వయంవరం’ ప్రకటించాడు. దమయంతికి అందచందాలు , తెలివి ఉండడంవలన దేవతలు అంతా వచ్చారు.  ఆమె మానవుల లో ‘నలునుని’ భర్తగా ఎంచుకుంది. ఆ కోపంతో దేవతలు ఆమె భర్త అయిన నలునునికి శని సహాయంతో ఎన్నో ఇబ్బందు కలిగించారు. జూదంలో రాజ్యం పోయేటట్లు, భార్యాబిడ్డల ను కొన్ని సం॥రాలు దూరం అయ్యేటట్లు చేశారు. నారదముని ఉపదేశంతో ‘తిరువల్లార్‌’ యాత్ర చేశారు. అక్కడ కోనేరులో స్నానం చేశారు. శని అనుగ్రహంచే బాధా విముక్తుడయ్యాడు. అంత  శనిని అనుగ్రహమూర్తిగా రాజ్యాధికారం ఇమ్మని వేడుకొన్నాడు. శని అందుకు ఒప్పుకొని, అక్కడ నల మహారాజు పేరు చెప్పిన వారిని తాకనని సెలవిచ్చెను. దీనివన అక్కడ శనిదేవుని దేవాలయం ఏర్పడిరది. ప్రతి రెండున్నర సం॥రాలు శని రాశిచక్రములో స్థానముగా మారినప్పుడు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. అనుగ్రహమూర్తిగా శనిదేవుడు ‘తిరువల్లార్‌’లో ప్రసిద్ధుడు.
శని స్థానచలనం ఒక రాశినుండి మరొక రాశికి మారితే ప్రతి మనిషి జీవితంలో (చాలా ప్రభావం ఏర్పడి) అనేక మార్పులు వస్తున్నాయి. అందరూ భయపడేది ఈ గ్రహానికే. ప్రతి ఊరిలో ప్రత్యేకంగా దేవాల యం లేకున్నా ‘నవగ్రహాల ’తో ప్రతిష్ఠింపబడి ఉంటున్నాడు.

మహారాష్ట్ర శని శింగణాపూర్‌: బహుశ శిరిడీ తెలియనివారు ఉండరు కదా! శిరిడీ నుంచి 2 గం॥ ప్రయాణం ఈ చోటుకి. శనిదేవుడు ‘స్వయంభువు’ గా వెలిసాడు. చాలా రద్దీగా, కోలాహంగా కిటకిటలాడుతూ ఉంటుంది. చాలా మహిమగల ప్రదేశం. తైలాభిషేకం చేస్తారు. ఆరుబయట బహిరంగంగా ఒక అరుగుమీద స్థూపాకారంలో శనిదేవుడు వుంటాడు. విగ్రహ స్థూపంపైన చెట్టుకొమ్మ నీడగా పడితే ఆ కొమ్మ కాలిపోయింది.  ఇంతకన్నా ప్రత్యక్ష నిదర్శనం లేదు. ఆ ఊరిలో ఇళ్ళకు తలపు ఉండవు. అక్కడ దొంగతనం జరుగదు. అలా జరిగితే శనేశ్వరుడు శిక్షిస్తాడు. నిష్టగా పూజిస్తే శనిబాధలు , పీడ తొగుతాయని అందరి నమ్మకం.

శని మందిర్, ఇండోర్: ఈ ఆలయాన్ని 300 సంవత్సరాల క్రితం పండిట్ గోపాలదాస్ తివారి నిర్మించారు.  ఒకసారి శనిదేవుడు తన కలలో కనిపించి తన విగ్రహాన్ని కనుగొనడానికి కొండను తవ్వమని కోరాడని చెబుతారు.  అతను అంధుడు కాబట్టి, తాను చెప్పినట్లు చేయలేనని శని దేవుడికి చెప్పాడు.  శని దేవ్ అతనిని కళ్ళు తెరవమని అడిగాడు మరియు వెంటనే అతని చూపు తిరిగి వచ్చింది.  ఈ అద్భుతం తర్వాత గోపాలదాస్ శని దేవుడికి భక్తుడు అయ్యాడు.  శనిదేవుడు చెప్పినట్లుగా కొండ కింద తన విగ్రహాన్ని కూడా కనుగొన్నాడు.  అప్పటి నుండి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది మరియు ప్రతి సంవత్సరం శని జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించబడతాయి.

మహారాష్ట్ర  గోదావరి ఒడ్డున ‘‘రాక్షస భవన్‌’’ అనే గ్రామానికి దగ్గర ఈ క్షేత్రముంది: ఈ ఆలయంలో ఆధ్యాత్మికంగా పురాతన శని దేవత విగ్రహం ఉంది.  ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, కాల పూజ లేకుండా శని ఆరాధన జరగదు.  ఇక్కడ శని దేవతతో పాటు కల్ లేదా యమ మరియు ఘటి లేదా సమయం ఏర్పాటు చేయబడ్డాయి.  శని దేవతకి ఇరువైపులా రాహు, కేతువుల విగ్రహాలు ఉంటాయి.  బృహస్పతి (దేవతల గురువు) విగ్రహాన్ని కూడా చూడవచ్చు.ఆలయంలోని శని దేవత విగ్రహాన్ని రామచంద్రుడు ప్రతిష్టించాడు.  త్రేతాయుగంలో రాముడు చెడు గ్రహాలచే ప్రభావితమైనప్పుడు (71/2 సంవత్సరాల బాధ), అగస్తి మహర్షి అతని నుండి శని దేవత విగ్రహాన్ని ప్రతిష్టించాడు.  ‘ఈ ప్రదేశాన్ని సందర్శించే భక్తుడిని నేను రక్షిస్తానుఅనే పదాలు విగ్రహంలో చెక్కబడి ఉన్నాయి.  అందుకే దాని పేరు రక్షోభువన్ (రక్షించడం(రక్ష)). వక్రీకరణ దానిని రాక్షసభువనంగా మార్చింది.  ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడిని ఈ ప్రదేశంలో ఆచారబద్ధంగా పూజించమని కోరాడు.  తదుపరి కాలంలో శివాజీ మహారాజ్ మరియు సెయింట్ నామ్‌దేవ్ ఇక్కడ పూజలు చేశారు.
ఇవి ముఖ్యమైన శని క్షేత్రాలు గా భాసిల్లు తున్నాయి. అష్టమ, అర్థాష్టమ, ఏలినాటి శని బాధితులు తప్పక దర్శించే స్థలాలు గా ప్రసిద్ధిపొందాయి.

శని ధామ్ ఆలయం, న్యూఢిల్లీ: ఈ ఆలయం న్యూఢిల్లీలోని ఛత్తర్‌పూర్ రోడ్డులో ఉంది మరియు ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ.  ఈ ఆలయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శని దేవ్ విగ్రహం ఉంది మరియు శని యొక్క సహజ శిలా విగ్రహం కూడా ఉంది మరియు ప్రధాన దేవతగా పూజించబడుతోంది.

శనీశ్వర భగవాన్ ఆలయం, తమిళనాడు: ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత అందమైన శని దేవాలయాలలో ఒకటి మరియు తమిళనాడులోని నవగ్రహ దేవాలయాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది.

శని దేవాలయం, దేవనార్: ఈ ఆలయం ముంబై సమీపంలోని డియోనార్ విగ్రహానికి సమీపంలో ఉంది.  ఇది శనీశ్వర దేవాలయం అని కూడా పిలువబడుతుంది మరియు చాలా ప్రసిద్ధి చెందింది.

మహారాష్ట్ర పండరీపూర్‌: శ్రీ పాండురంగ దేవాయం వెనుక శని విగ్రహం ఉంది. పండరీపుర దర్శనంలో ఇది చాలా ముఖ్యం.
శ్రీ శని దేవాలయం, టిట్వాలా: మహారాష్ట్రలోని థానే ఉంటే జిల్లాలో ఇది మరొక ఆలయం.  టిట్వాలా రెండు పవిత్ర పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి చెందింది.

బన్నంజే శ్రీ శని క్షేత్రం, కర్ణాటక: ఈ ఆలయ సముదాయంలో 23 అడుగుల ఎత్తైన శని దేవుడి విగ్రహం ఉంది మరియు ఇది ఉడిపిలో ఉంది.

యమధర్మ రాజు మరణానంతరం చేసిన కర్మలకు తగ్గ ఫలితాలను ఇస్తుండగా, శని తన ప్రస్తుత జీవితంలోనే తన కర్మల ఫలాలను ఒక వ్యక్తికి ఇస్తాడని అంటారు. శని భగవంతుడిని మీ భక్తితో ప్రార్థించండి మరియు మీ ఆలోచనలను  శనిశ్వరుడు మెచ్చుకోవడానికి మంచి పనులు చేయండి.  ఆయన  మన మాటలను కాదు కేవలం చర్యలను అర్థం చేసుకునే దేవుడు శని భగవానుడు .  అతను మొత్తం పురాణాలలో అత్యంత నిష్పాక్షికమైన దేవుడు మరియు అతను చెడును శిక్షించేలా చేస్తాడు మరియు మంచికి ప్రతిఫలమిస్తాడు.  కాబట్టి, శని దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి ఇతరులతో ప్రవర్తన విషయాల్లో అనగా  గౌరవముగ ప్రవర్తించటము, వృద్దులకి  సహాయము, బీదలకు అంగవైకళ్యము కలవారికి సహకారము ,క్రమశిక్షణగా ఉండే అంశాలలో, న్యాయబద్ధముగ  వ్యవహరించటం , కష్టపడి బద్దకము లేకుండా పనులు చేయటము మొదలైనవి చేస్తూ శనిభగవానుని కృపకు పాత్రులు అయ్యేట్లు ఆలోచించండి.

డా|| ఈడుపుగంటి పద్మజారాణి

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు